కార్డన్‌ సెర్చ్‌.. అదుపులోకి 12 మంది | Hyderabad Police Cordon Search Operation at saidabad | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌.. అదుపులోకి 12 మంది

Feb 17 2017 8:32 AM | Updated on Aug 21 2018 5:51 PM

సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. స్థానిక సింగరేణి కాలనీలో ఉదయం 3 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 37 ద్విచక్రవాహనాలు, 48 గ్యాస్‌ సిలిండర్లు, 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement