పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు | Husband arrested at his second marriage function | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు

Jun 7 2014 8:56 AM | Updated on Sep 2 2017 8:27 AM

పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు

పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు

కట్నం కోసం రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్దుడు. ఆ విషయం తెలిసన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కట్నం కోసం రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్దుడు. ఆ విషయం తెలిసన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పెళ్లికోడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్నగర్లో శనివారం చోటు చేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే అతడు అదనపు కట్నం కావాలని నిరంతరం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆ క్రమంలో ఆమె పుట్టింటి నుంచి కొంత నగదు తీసుకువచ్చి భర్త ఇచ్చింది.

 

ఆ నగదు అయి పోగానే మళ్లీ నగదు కావాలని ఆమెను వేధించసాగాడు. తన తల్లిదండ్రులకు నగదు ఇచ్చేంత స్థోమత లేదని ఆమె భర్తకు వెళ్లడించింది. దాంతో రవిశంకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని అతడు గోప్యంగా ఉంచాడు. అయితే ఆ విషయాన్ని రవిశంకర్ భార్య తెలుసుకుంది. దాంతో ఆమె సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. శనివారం సనత్నగర్లో రెండో వివాహం చేసుకుంటున్న రవిశంకర్ను పెళ్లి పీటల మీద అరెస్ట్ చేయించింది. దీంతో పెళ్లి కొడుకును సనత్ నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు.  అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement