
మత్తుమందిచ్చి హాస్టల్ నిర్వాహకుడి నిర్వాకం!
యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి యత్నించాడో హాస్టల్ నిర్వాహకుడు.
అమీర్‌పేట: యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి యత్నించాడో హాస్టల్ నిర్వాహకుడు. ఈ ఘటనలో నిందితుడిని ఎస్సార్‌నగర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ నవీన్ కథనం ప్రకారం.. గురజాలకు చెందిన నరేందర్‌రెడ్డి అనే యువకుడు 10 నెలల కిత్రం నగరానికి వచ్చి బల్కంపేట బీకేగూడలో 'అర్రు' హాస్టల్ నడుపుతున్నాడు. కోయంబత్తూర్‌కు చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇతని హాస్టల్‌లో దిగింది.
రూంలోని బ్యాగులో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో ఆమె నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసిచెప్పింది. హాస్టల్ వద్ద ఎందుకు బీకేగూడ పార్కు వద్దకు వస్తే మాట్లాడతానని చెప్పడంతో ఆమె వెళ్లింది. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న ఓ రూమ్‌కు తీసుకెళ్లిన నరేందర్‌రెడ్డి బలవంతంగా ఆమె నోట్ల సిగరెట్ పెట్టాడు. దీంతో ఆమెకు మత్తు వచ్చినట్లైంది. అతడి పన్నాగం కనిపెట్టిన యువతి అతడి నుంచి తప్పించుకొని బాలానగర్‌లో ఉంటున్న తన పెద్దమ్మ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆమె సహాయంతో ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నరేందర్‌రెడ్డిపై లైంగికదాడికి యత్నం కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.