ఓయూలో ఉద్రిక్త వాతావరణం | High tension in osmania university campus | Sakshi
Sakshi News home page

ఓయూలో ఉద్రిక్త వాతావరణం

Mar 18 2015 12:18 PM | Updated on Nov 9 2018 4:51 PM

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ ఐకాస నాయకులు బుధవారం ఆర్ట్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ ఐకాస నాయకులు బుధవారం ఆర్ట్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని ఐకాస నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగ ఐకాస నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీలో మోహరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement