హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు! | Hero Mahesh babu as Brand ambassador of Hyderabad? | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు!

Feb 12 2015 11:56 AM | Updated on Sep 7 2018 2:20 PM

హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు! - Sakshi

హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు!

హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ తన 'దూకుడు'ను కొనసాగిస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా ...

హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ తన 'దూకుడు'ను కొనసాగిస్తున్నారు.  డల్లాస్ నగరం కంటే ఘనంగా భాగ్యనగరాన్ని మార్చుతామన్న ఆయన తాజాగా 'హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ నటుడు మహేష్ బాబును నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.  ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచే అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.  

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మాణం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్న ఆయన హైదరాబాద్కు ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని యోచిస్తున్నారు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

ఇక అన్నివర్గాల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే బాగుంటుందని కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు... ఇదే విషయాన్ని ఆయన కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్ బాబుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ...సెటిలర్స్ను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఫాస్ట్ పథకంపై గత ఏడాది అనుసరించిన విధానాన్నే అనుసరిస్తామని చెప్పటం విశేషం.  

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఇక్కడ సెటిలైపోయిన లక్షలాది సీమాంధ్రుల ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. వారి మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకోవడం చాలా కష్టమైన విషయం అన్నది కేసీఆర్ గ్రహించినట్లు ఉన్నారు.  కేసీఆర్ కూడా 'ప్రిన్స్' ద్వారా ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement