జనసంద్రంగా లోటస్ పాండ్ | heavy crowd in lotus pond | Sakshi
Sakshi News home page

జనసంద్రంగా లోటస్ పాండ్

Oct 8 2013 3:12 AM | Updated on Aug 8 2018 5:45 PM

జనసంద్రంగా లోటస్ పాండ్ - Sakshi

జనసంద్రంగా లోటస్ పాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ చేస్తున్న ‘సమైక్య దీక్ష’ శిబిరానికి ప్రజలు

 సాక్షి,సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ చేస్తున్న ‘సమైక్య దీక్ష’ శిబిరానికి ప్రజలు వేలాది తరలివస్తున్నారు. లోటస్ పాండ్‌లోని జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆవరణలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారంతో మూడురోజులు పూర్తి చేసుకొని నాల్గో రోజుకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిమంది ప్రవాహంలా రాసాగారు. వీరిని క ట్టడి చేసేందుకు  పోలీసులు, జగన్ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. జై సమైకాంధ్ర, జగన్ నాయకత్వం వర్థిల్లాలి, సమైక్య దీక్ష విజయవంతం కావాలంటూ ప్లకార్డు చేతపట్టిన దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసుకుంటూ శిబిరానికి వచ్చారు. జన రద్దీకి తట్టుకోలేక పోలీసులు శిబిరం వద్ద క్యూ పెట్టించారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రజలను జగన్ ఆప్యాయంగా పలకరించారు.
 
 ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు లోటస్ పాండ్‌లో దారి పోడువున వచ్చిపోయే జనంతో లోటస్ పాండ్ జనసంద్రంగా మారింది. వైఎస్సార్ సీపీ నేత దేప భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మైనార్టీ నేత మతిన్ ఆధ్వర్యంలో వందలాదిగా ప్రజలు ప్లకార్డులు,బ్యానర్లు చేత పట్టి నినాదాలు చేసుకుంటూ వచ్చి జగన్‌ను కలిశారు. పార్టీ సాంస్కృతిక విభాగం నేత వంగపండు ఉషా బృందం దీక్ష శిబిరానికి ఒక వైపు వేదికపై నుంచి  పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. నగర పార్టీ నేత కొలన్ శ్రీనివాస్ రెడ్డి, అనుచరులు ధనరాజు యాదవ్, సునీల్ రెడ్డి, ఎస్. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదిస్తూ శిబిరం వద్ద చేరుకున్నారు.
 
 రఘురాంకృష్ణమ రాజు నాయకత్వంలో ఫిల్మ్‌నగర్‌కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున్న దీక్ష శిబిరానికి చేరుకొని జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నగర పార్టీ నేతలు ఆదం విజయ్‌కుమార్,  ముక్కా రూపానందరెడ్డి తదితరులు జగన్ మోహన్ రెడ్డిని దీక్ష శిబిరంలో కలిశారు. పార్టీ నగర నేత సురేష్ రెడ్డి ఓ బాలికను తెలుగు తల్లిలా అలంకరించి ప్రదర్శనగా దీక్ష శిబిరానికి తీసుకువచ్చారు.పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి,కోటం రెడ్డి వినయ్ రెడ్డి, సయ్యద్ సాజద్ అలీ, రవికుమార్,  ప్రపుల్లా రెడ్డి,వెల్లాల రాంమోహన్‌లు తమ తమ అనుచరులతో శిబిరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, అమృత సాగర్, రాచమల్లు రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement