రోగినంటూ ఆసుపత్రికి వచ్చిన యువకుడు పిస్టల్ చూపించి వైద్యురాలి ఆభరణాలను దోచుకుపోయాడు.
వైద్యురాలి నగల దోపిడి
గోల్కొండ: రోగినంటూ ఆసుపత్రికి వచ్చిన యువకుడు పిస్టల్ చూపించి వైద్యురాలి ఆభరణాలను దోచుకుపోయాడు. షేక్‌పేట్ నాలా సమీపంలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్లో డాక్టర్ విజయలక్ష్మి డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 8.30 సమయంలో క్లినిక్‌కు వచ్చిన ఓ యువకుడు (24) పంటి నొప్పి ఉందని చెప్పాడు.
విజయలక్ష్మి చికిత్స చేస్తుండగానే, తన జేబులోంచి పిస్టల్ తీసి.. ఒంటిపై ఉన్న బంగారు నగల్ని టేబుల్‌పై పెట్టాలని బెదిరించాడు. డాక్టర్ మూడు జతల గాజులు, మూడు తులాల గొలుసు తదితర పది తులాల బంగారు ఆభరణాలను టేబుల్‌పై ఉంచారు. వాటిని జేబులో కుక్కుకుని యువకుడు పరారయ్యాడు. అనంతరం బాధితురాలు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.