పిస్టల్‌తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి

Delivery boy arrested in physical assault case after gunfight - Sakshi

నోయిడా: ఒక కస్టమర్‌పై ఆమె ఫ్లాట్‌లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్‌ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్‌ సుమిత్‌ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్‌మెంట్‌లో పార్సిల్‌ డెలివరీ సందర్భంగా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న  యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్‌లో అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్‌ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం  వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్‌ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top