యాదమ్మకు ఎన్ని కష్టాలో.. | handicap yadamma road crossing in hyderabad | Sakshi
Sakshi News home page

యాదమ్మకు ఎన్ని కష్టాలో..

Jun 7 2015 1:36 PM | Updated on Aug 30 2018 4:15 PM

యాదమ్మకు ఎన్ని కష్టాలో.. - Sakshi

యాదమ్మకు ఎన్ని కష్టాలో..

నిరంతరం రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి సాధారణ మనుషులే చాలా ఇబ్బంది పడుతారు.

సూరారం (హైదరాబాద్ సిటీ): నిరంతరం రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి సాధారణ మనుషులే చాలా ఇబ్బంది పడుతారు. అలాంటిది వికలాంగురాలు అయిన యాదమ్మ అనేక కష్టాలు పడి ఎలాగోలా రోడ్డు దాటింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సురారంలో ఆదివారం జరిగింది. సూరారం ప్రాంతానికి చెందిన యాదమ్మకు రెండు కాళ్లు లేవు. దీంతో చక్రాలు అమర్చిన చెక్క సహాయంతో ఆమె రెండు చేతులు ఉపయోగించి ప్రయాణం చేస్తుంది.

కాగా, ఆదివారం ఒక పక్క వర్షం, మరో పక్క రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు, ఇవన్నీ చాలవన్నట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్న డివైడర్.. వీటినన్నింటిని దాటుకొని యాదమ్మ ఎలాగోలా చివరికి రోడ్డు దాటింది. ప్రభుత్వం ఇప్పటికైనా వికలాంగుల గురించి ఆలోచించాలని అక్కడి వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement