బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ? | gutta sukhender reddy takes on revanth reddy | Sakshi
Sakshi News home page

బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?

Jun 21 2016 1:28 PM | Updated on Sep 4 2017 3:02 AM

బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?

బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

నల్గొండ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత రేవంత్రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కండువాలు కప్పుతున్నది కనిపించడం లేదా అని రేవంత్ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నేను గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగితే...పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. నన్ను విమర్శించే స్థాయి ఉత్తమ్కుమార్కు లేదని గుత్తా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement