పూలు పంచి... చైతన్యం పెంచి! | Granted ... to raise the consciousness of flowers ! | Sakshi
Sakshi News home page

పూలు పంచి... చైతన్యం పెంచి!

Jul 26 2016 9:44 PM | Updated on Sep 4 2017 6:24 AM

కరపత్రాలు, పూలు పంపిణీ చేస్తున్న దృశ్యం

కరపత్రాలు, పూలు పంపిణీ చేస్తున్న దృశ్యం

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని గ్రేటర్‌ తెలంగాణ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం పంజగుట్ట కూడలి వద్ద అమరవీరులను స్మరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

పంజగుట్ట: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని గ్రేటర్‌ తెలంగాణ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం పంజగుట్ట కూడలి వద్ద అమరవీరులను స్మరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య చిత్రపటాన్ని చూపుతూ వాహనదారులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెంట్, కార్‌ సీటు బెల్ట్‌ పెట్టుకోవాలని కోరుతూ పూలు, కరపత్రాలు పంచిపెట్టారు. అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జోగీందర్‌ సింగ్, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement