జీహెచ్‌ఎంసీకి ‘ఆడిట్’ అక్షింతలు | GHMC 'Audit' Alienation | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీకి ‘ఆడిట్’ అక్షింతలు

Feb 14 2014 3:56 AM | Updated on Sep 2 2017 3:40 AM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అంటేనే అక్రమాలకు నెలవనే ప్రచారం ఉంది. దానికి మరింత బలాన్నిస్తూ..

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అంటేనే అక్రమాలకు నెలవనే ప్రచారం ఉంది. దానికి మరింత బలాన్నిస్తూ.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీలోని ఆయా విభాగాల్లో పలు అవకతవకలు జరిగినట్లు ఆడిట్ విభాగం పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంది.
 
 ఆడిట్ విభాగం తప్పుబట్టిన అంశాలివే..

 గోషామహల్‌లో అనుమతి పొందిన లేఔట్, అవసరమైన ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా బీపీఎస్ ద్వారా కొన్ని భవనాల్ని క్రమబద్ధీకరించారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఫీజుల రూపేణా రూ. 12,95,092 నష్టం వాటిల్లింది
     
 మల్కాజిగిరి సర్కిల్‌లో బీపీఎస్/ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్ల క్లియరెన్స్ కోసమని అదనపు సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. దాని కాంట్రాక్టును ఎస్వీఎస్‌ఎస్ అనే ఏజెన్సీకి అప్పగించి, రూ.4,59,100 చెల్లించారు. బీపీఎస్/ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లలో ఎన్ని ఫైళ్లు సర్కిల్‌కు అందాయో, ఎన్ని పెండింగ్‌లో పడ్డాయో వివరాల్లేవు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి ఇతర వివరాలూ లేవు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
     
 మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ రిజర్వాయర్ నుంచి 10 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ఆర్నెళ్లపాటు కాంట్రాక్టరు బి.శ్రీనివాసరావుకు అప్పగించారు. ట్రిప్పుకు రూ. 116 చొప్పున చెల్లించారు. కానీ, ఏయే ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేశారు?, నీటి కొరత ఉన్న ప్రాంతాలకే సరఫరా చేశారా? తదితర వివరాలేవీ లేవు. రూ.22,36,857 మేరకు చెల్లింపులపై అనుమానాలున్నాయి
     
 ఆస్తిపన్ను, వివిధ ఫీజులు, ట్యాక్సుల కింద జీహెచ్‌ఎంసీ స్వీకరించిన చెక్కుల్లో కొన్ని బౌన్స్ అయ్యాయి. మరికొన్ని చెక్కుల మొత్తం ఖజానాకు చేరలేదు. తద్వారా జీహెచ్ ఎంసీకి రూ. 28,55,133 నష్టం వాటిల్లింది. కాప్రా, అబిడ్స్ సర్కిళ్లలో ఈ తతంగం జరిగింది
     
 ఆబిడ్స్ సర్కిల్‌లో పావలావడ్డీ పథకం కింద రూ. 51,15, 538 మేర జీహెచ్‌ఎంసీ సాధారణ నిధులను వ్యయం చేయడం ఆక్షేపణీయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement