అదృశ్యమైన ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు నలుగురు గోవాలో ప్రత్యక్షమయ్యారు.
హైదరాబాద్: ఎల్బీనగర్లో కలకలం సృష్టించిన నలుగురు విద్యార్థుల కిడ్నాప్ ఘటన అంతా ఉత్తితిదేనట. ఈ కిడ్నాప్ హైడ్రామా వెనక అసలు కథ ఏంటో త్వరలో తేలనుంది. ఎల్బీనగర్లో అదృశ్యమైన ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు నలుగురు బుధవారం గోవాలో ప్రత్యక్షమయ్యారు. గోవా నుంచి సాయినాథ్, లిఖిత్ కుమార్, సాయికుమార్, విజయ్ కుమార్ నలుగురు ఈ రోజు హైదరాబాద్కు తిరుగు పయనమైనట్టు తెలిసింది.
నిన్న (మంగళవారం)టి నుంచి వారు కనిపించకుండా పోవడంతో విద్యార్థులను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ భావించారు. నిన్న స్కూల్ వద్ద ఎవరో రెడ్ కలర్ మారుతి వ్యాన్లో వచ్చి నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లారని తోటి విద్యార్థులు చెప్పడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైతేనేమీ నలుగురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియగానే వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.