దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. | Five dead in massive road mishap at dundigal police station | Sakshi
Sakshi News home page

దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

Apr 28 2016 8:10 AM | Updated on Sep 3 2017 10:53 PM

దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

నగరంలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గాగిల్లాపూర్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గాగిల్లాపూర్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. సీఎం కేసీఆర్ ఈ ప్రమాదం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లికి మండలం దేవుల్లపల్లి గ్రామస్తులు సూరారంలోని శివాలయనగర్‌లోని అమ్మవారి టెంపుల్లోని ఓ శుభకార్యానికి వచ్చారు.

వారంతా ట్రాక్టర్‌లో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండిగల్‌లోని చర్చి గాగిల్లాపూర్ వద్ద మెదక్ నుంచి అతివేగంతో వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. గాయపడ్డ వారిలో తేజా(10), శోభ (25), భవానీ(20), శ్రీదేవి(1)ల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మొగులానసాబ్‌ (55), నవీన్‌గౌడ్‌ (23), అంజమ్మ (65), భీమయ్య (60), రాజుగౌడ్‌ (10) గా పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement