జేఎన్‌టీయూలో అగ్నిప్రమాదం | fire accident in hyderabad JNTU college | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో అగ్నిప్రమాదం

Feb 4 2017 6:29 PM | Updated on Sep 13 2018 5:11 PM

కూకట్‌పల్లిలోని జె.ఎన్.టి.యు కళాశాలలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని జె.ఎన్.టి.యు కళాశాలలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. కళాశాల ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చునని భావిస్తున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement