ఫ్యాషన్ కస్టమైజ్ | fashion customize | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ కస్టమైజ్

Jan 26 2015 6:07 AM | Updated on Oct 1 2018 1:12 PM

ఫ్యాషన్ కస్టమైజ్ - Sakshi

ఫ్యాషన్ కస్టమైజ్

నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నగరవాసుల అభిరుచికి...

నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నగరవాసుల అభిరుచికి అనుగుణంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సాహిల్ గులాటి బంజారాహిల్స్‌లో ఎస్‌జీ ఫ్యాషన్ స్టూడియోను అందుబాటులోకి తీసుకొచ్చారు. వస్త్రాభిమానులకి నచ్చిన విధంగా డిజైన్ చేసి డ్రెస్సులను ఇక్కడ అందిస్తారు. సల్వార్ సూట్స్, బ్రైడల్, ట్రెడిషనల్, వెస్ట్రర్న్, పార్టీ, నైట్ వేర్స్ ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి. ‘కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా డ్రెస్సులు డిజైన్ చేసి ఇచ్చేందుకు కొత్తగా ఫ్యాషన్ స్టూడియోను ప్రారంభించా. మరో డిజైనర్ అబ్దుల్ అజీమ్‌తో కలసి ట్రెండింగ్ ఫ్యాషన్స్‌కు శ్రీకారం చుట్టా’ అని సహిల్ గులాటి చెప్పారు. ఔత్సాహిక డిజైనర్లకు పాఠాలు చెప్పేందుకు ‘కోటురే’ ద డిజైనర్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ప్రారంభించారు.  
  సాక్షి, సిటీ ప్లస్

Advertisement
 
Advertisement
Advertisement