9999 @ రూ.7లక్షలు | fancy-number-auction in hyderabad rta | Sakshi
Sakshi News home page

9999 @ రూ.7లక్షలు

Jun 9 2016 8:42 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఫ్యాన్సీనంబర్ల వేలంతో నగర రవాణాశాఖకు కాసుల పంట పండుతోంది.

హైదరాబాద్: ఫ్యాన్సీనంబర్ల వేలంతో నగర రవాణాశాఖకు కాసుల పంట పండుతోంది. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నూతన సిరీస్ ప్రారంభం కావడంతో ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఈ వేలంలో 9999 నంబరుకు రూ.7 లక్షల ధర పలికింది. టెండర్ బిడ్ రూపంలో నిర్వహించిన వేలంలో రూ.1.14 కోట్లు విలువచేసే మెర్సిడెస్ బెంజ్ కారుకు ఐటన్‌ల్యాబ్ ప్రతినిధులు రూ.7 లక్షలు వెచ్చించి 9999 నంబరును సొంతం చేసుకున్నారు. ఇక, 0006 నంబరుకు రూ.3.55 లక్షలు, 0007 నంబరుకు రూ.1.80 లక్షల ధర పలికింది. మొత్తంగా ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఒకే రోజు రూ.14.01 లక్షల ఆదాయం లభించినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement