విదేశాల్లో ఉద్యోగాలు పేరిట మోసం | Fake consultancies cheating unemployed youth in Hyderabad | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఉద్యోగాలు పేరిట మోసం

Nov 6 2014 6:15 PM | Updated on Oct 4 2018 7:05 PM

నగరంలోని కొత్తపేటలో ఉద్యోగాల పేరుతో ఓ కన్సెల్టెన్సీ ఘరానా మోసానికి పాల్పడింది.

నగరంలోని కొత్తపేటలో ఉద్యోగాల పేరుతో ఓ కన్సెల్టెన్సీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులకు టోకరా వేసింది. టీఎంసీఎస్ అనే కన్సెల్టెన్సీ ఈ మోసానికి పాల్పడినట్టు తెలిసింది. ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేసింది.

చివరికి తాము మోసపోయామని తెలుసుకున్నబాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement