వేధింపుల కేసులో ఈటీవీ-2 సీరియల్స్ నిర్మాత అరెస్టు | etv-2 Series producer arrested in assault case | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసులో ఈటీవీ-2 సీరియల్స్ నిర్మాత అరెస్టు

Mar 4 2015 12:20 AM | Updated on Oct 2 2018 6:54 PM

వేధింపుల కేసులో ఈటీవీ-2 సీరియల్స్ నిర్మాత అరెస్టు - Sakshi

వేధింపుల కేసులో ఈటీవీ-2 సీరియల్స్ నిర్మాత అరెస్టు

ఈ టీవీ-2 సీరియల్స్ నిర్మాత వెంకటాచలపతిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది.

అమీర్‌పేట: ఈ టీవీ-2 సీరియల్స్ నిర్మాత వెంకటాచలపతిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. సీరియల్‌లో నటిస్తున్న తనను చలపతి వేధిస్తున్నారని నటి సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్‌ఐ అజేయకుమార్ కథనం మేరకు వివరాలివీ.. మియాపూర్‌కు చెందిన వెంకటాచలపతి  ఈ టీవీ-2లో ప్రసారం అవుతున్న సీరియల్స్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. రాజీవ్‌నగర్‌లో ఉంటున్న ఆడదె ఆధారం, అత్తా కోడళ్లు సీరియల్స్‌లో నటించిన సంధ్య అనే మహిళ సఖీ సీరియల్ ద్వారా చలపతితో పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి ఆమెను వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. తనకు వివాహం అయిందని సంధ్య చెప్పినా వినిపించుకోలేదు. అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించాడు. చలపతి వేధింపులు తట్టుకోలేక సంధ్య పోలీసులను ఆశ్రయించింది. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ అజేయకుమార్ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement