breaking news
Venkatachalapathi
-
వేధింపుల కేసులో ఈటీవీ-2 సీరియల్స్ నిర్మాత అరెస్టు
అమీర్‌పేట: ఈ టీవీ-2 సీరియల్స్ నిర్మాత వెంకటాచలపతిపై ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదైంది. సీరియల్లో నటిస్తున్న తనను చలపతి వేధిస్తున్నారని నటి సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్ఐ అజేయకుమార్ కథనం మేరకు వివరాలివీ.. మియాపూర్‌కు చెందిన వెంకటాచలపతి ఈ టీవీ-2లో ప్రసారం అవుతున్న సీరియల్స్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. రాజీవ్‌నగర్‌లో ఉంటున్న ఆడదె ఆధారం, అత్తా కోడళ్లు సీరియల్స్‌లో నటించిన సంధ్య అనే మహిళ సఖీ సీరియల్ ద్వారా చలపతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. తనకు వివాహం అయిందని సంధ్య చెప్పినా వినిపించుకోలేదు. అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించాడు. చలపతి వేధింపులు తట్టుకోలేక సంధ్య పోలీసులను ఆశ్రయించింది. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ అజేయకుమార్ తెలిపారు. -
ప్రేమించలేదని పొడిచి చంపాడు...
చెన్నైలో సహోద్యోగినిని హత మార్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చెన్నై: ప్రేమించడానికి నిరాకరించిన పాపానికి మరో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. చెన్నైలో సోమవారం అర్ధరాత్రి.. తన ప్రేమను నిరాకరించిందంటూ తోటి ఉద్యోగినిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొడిచి చంపాడు. తర్వాత తానూ పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం పోలీసులు వెల్లడించిన వివరాలు.. వేంకటాచలపతి (29), వైశ్య (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులు.సోమవారం రాత్రి విధులు ముగించుకుని వైశ్య పెరుంగుడి రైల్వే స్టేషన్ వద్ద నడుచుకుంటూ వస్తుండగా ఆమెతో వేంకటాచలపతి ఘర్షణ పడ్డాడు. వాగ్వాదం పెరగడంతో కోపోద్రిక్తుడైన వేంకటాచలపతి ఆమెను కత్తితో పొడిచాడు. తర్వాత తానూ పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వైశ్యను ఆస్పత్రికి తరలిం చగా అప్పటికే మృతిచెందింది. వేంకటాచలపతి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన నేపథ్యంలో రాత్రి పూట ఐటీ ఉద్యోగినులు సురక్షితంగా ఇంటికి చేరే విషయంపై మరోసారి ఆందోళనలు పెరిగాయి. గత ఫిబ్రవరిలో టీసీఎస్ ఉద్యోగి అయిన 24 ఏళ్ల మహిళను నగర శివార్లలోని కార్యాలయం సమీపంనుంచి అప హరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై దారుణానికి పాల్పడి హతమార్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 8:30 దాటితే ఉద్యోగినులను టూ వీలర్లపై అనుమతించరాదని, కంపెనీల పరిసరాల్లో కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయాలని కూడా పోలీసులు ఆదేశాలు జారీచేశారు.