ఆయన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత ? | Errabelli dayakar rao takes on chandrababu | Sakshi
Sakshi News home page

ఆయన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత ?

Mar 12 2016 12:07 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఆయన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత ? - Sakshi

ఆయన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత ?

టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనానికి ప్రజామోదం ఉందని ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనానికి ప్రజామోదం ఉందని ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... పార్టీ శాసనసభ పక్షాన్నే టీఆర్ఎస్లో విలీనం చేశాం కానీ ఫిరాయింపు కాదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ ఎన్టీఆర్ను గద్దె దించి బాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే మేం చేసింది
ఎంత అని విలేకర్లను ప్రశ్నించారు. టీఆర్ఎస్లోకి వస్తానంటూ నేను ఏ నేతకు ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement