ఉద్యోగులకు అత్తెసరు డీఏ! | emergency da for ap employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు అత్తెసరు డీఏ!

Aug 20 2016 1:26 AM | Updated on Sep 4 2017 9:58 AM

ఉద్యోగులకు అత్తెసరు డీఏ!

ఉద్యోగులకు అత్తెసరు డీఏ!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కోత వేసేం దుకు సర్కారు సిద్ధమైంది.

ఒక్క కరవు భత్యంతోనే సరి
గత ఏడాది జూలై నుంచి డీఏకు నేటి కేబినెట్‌లో ఆమోదం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కోత వేసేం దుకు సర్కారు సిద్ధమైంది. గత ఏడాది జూలై నుంచి, ఈ ఏడాది జనవరి నుంచి రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా... ప్రస్తుతం ఒక్క డీఏ ఇచ్చేందుకే  సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని పెండిం గ్‌లో పెట్టేశారు. మరోవైపు ఈ ఏడాది జూలై నుంచి కూడా మరో కరువు భత్యం ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ మంజూరు ఫైలును విజయవాడలో శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి పంపించాలని ప్రభుత్వ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు జూలై నుంచి డిసెంబర్ వరకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేయనున్నారు. అంటే కరువు భత్యం 12.052 శాతం నుంచి 15.196 శాతానికి పెరగనుంది. జూలై నుంచి ఆగస్టు వరకు పెరిగిన కరువు భత్యాన్ని ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమ చేస్తారు. సెప్టెంబర్ నుంచి పెరిగిన కరువు భత్యాన్ని అక్టోబర్ 1వ తేదీ జీతాలతో కలిపి ఇవ్వనున్నారు. కరువు భత్యం పెంపు కారణంగా ఏడాదికి రూ.1900 కోట్ల వ్యయం కానుంది. ఇలా ఉండగా బియ్యం, పప్పులు విక్రయాలపై రాష్ట్రంలో రెండు శాతం సీఎస్‌టీ చెల్లిం చాల్సి ఉంది.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, మహారాష్ర్టలో సీఎస్‌టీ లేదని, ఆ రాష్ట్రాల్లో విక్రయించిన బియ్యం, పప్పులపై సీఎస్‌టీ చెల్లించాలనడం సమంజసం కాదని, రద్దు చేయాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వాణిజ్య, ఆర్థిక శాఖలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ మంత్రి మిల్లర్లతో మాట్లాడుకుని సీఎస్‌టీ రద్దుకు పావులు కదిపారు. ఈ మేరకు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సీఎస్‌టీ రద్దు అంశం రానుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లు నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు!
వచ్చే నెల 8వ తేదీలోగా జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారా లేదా వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదిస్తారా? అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కూడా శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement