నిరుద్యోగ ర్యాలీకి డీవైఎఫ్‌ఐ మద్దతు | dyf support for rally unemployed | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ ర్యాలీకి డీవైఎఫ్‌ఐ మద్దతు

Feb 17 2017 3:00 AM | Updated on Jul 29 2019 2:51 PM

నిరుద్యోగ ర్యాలీకి డీవైఎఫ్‌ఐ మద్దతు - Sakshi

నిరుద్యోగ ర్యాలీకి డీవైఎఫ్‌ఐ మద్దతు

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే: కోదండరాం

హైదరాబాద్‌: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.  గురువారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ నాయకులు ఎ.విజయ్‌కుమార్, మహేందర్, నిరం జన్‌లతో టీజేఏసీ నేతలు సమావేశమయ్యారు.

ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీజేఏసీ చేపడుతున్న ర్యాలీకి మద్దతు ఇవ్వాలని డీవైఎఫ్‌ఐ నాయకులను కోదండరాం కోరగా వారు సానుకూలంగా స్పందిం చారు. జేఏసీ ర్యాలీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోపాటు ఈ నెల 22వ తేదీలోగా అన్ని జిల్లాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ర్యాలీలు, సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement