మరణిస్తూ ప్రాణదానం | Donation organs Singareni employee | Sakshi
Sakshi News home page

మరణిస్తూ ప్రాణదానం

Mar 26 2016 12:37 AM | Updated on Sep 2 2018 4:19 PM

రోడ్డు ప్రమాదానికి గురై... తాను మరణిస్తూ... తన అవయవాలు దానం చేసి మరో ఏడుగురికి ప్రాణం పోశాడు సింగరేణి ఉద్యోగి.

 పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురై... తాను మరణిస్తూ... తన అవయవాలు దానం చేసి మరో ఏడుగురికి ప్రాణం పోశాడు సింగరేణి ఉద్యోగి. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం ... వరంగల్ జిల్లా భూపాల్‌పల్లికి చెందిన ఎం.నర్సయ్య(55) సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23నద్విచక్ర వాహనంపెవైళుతుండగా భూపాల్‌పల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
 
  చికిత్స పొందుతూ అదే రోజు బ్రైయిన్‌డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. నర్సయ్య భార్య పద్మ, ఆయన పిల్లలకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారు. అతనికి శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, కాలేయం, కళ్లు, రెండు హార్ట్‌వాల్వ్‌లను తొలగించి అవసరమైన వారికి అమర్చారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన విద్యార్థిని యశోద(20) ఈ నెల 22నసోదరునితో ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు.
 
  తీవ్ర గాయాలు కావడంతో ఆమెను అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలిం చారు. 23నఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల అనుమతితో రెండు కిడ్నీలు, కాలేయం, కళ్లు, రెండు హార్ట్ వాల్వ్‌లను తొలగించి అవసరమైనవారికి అమర్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన కొర్ర శంకర్(44) ప్రభుత్వ ఉద్యోగి. ఈ నెల 22న ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. 23న బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అతని భార్య శాంతాబాయి అవయవ దానానికి అంగీకరించారు. దీంతో ఆయన రెండు కిడ్నీలు, కాలేయం తొల గించి అవసరమైనవారికి అమర్చారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement