బంజారాహిల్స్లో కారు బీభత్సం: ఒకరు మృతి | Divider boarded the car out of control in Banjara hills road no 2 | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో కారు బీభత్సం: ఒకరు మృతి

Nov 23 2014 10:40 AM | Updated on Aug 25 2018 5:41 PM

బంజారాహిల్స్లో కారు బీభత్సం: ఒకరు మృతి - Sakshi

బంజారాహిల్స్లో కారు బీభత్సం: ఒకరు మృతి

నగరంలోని కృష్ణానగర్లో కారు బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్లో మరో కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్లో కారు బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే బంజారాహిల్స్లో మరో కారు బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి బంజారాహిల్స్లో అడీ కారు అధిక వేగంతో వెళ్తూ డీవైడర్ను ఢీ కొట్టింది. అనంతరం ఆ పక్కనే వెళ్తున్న రెండు బైకులను డీ కొట్టింది. ఆ ప్రమాదంలో బైక్లపై నుంచి ముగ్గురు వ్యక్తులు కింద పడ్డారు. ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కారులోని యువకుడు, అతడి గర్ల్ఫ్రెండ్ కారును వదిలి అక్కడి నుంచి పరారైయ్యారు.

ఇంతలో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆడీ కారును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా తన కుమారుడి మృతి కారణమైన యువకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి తండ్రి కుటుంబ సభ్యులతో వచ్చి బంజారాహిల్స్ పోలీసులను డిమాండ్ చేశారు. ఆ క్రమంలో పోలీసుస్టేషన్ వద్ద మృతుని బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement