‘ఏసీసీఏ’తో గీతం అవగాహనా ఒప్పందం | details about charterd accountants | Sakshi
Sakshi News home page

‘ఏసీసీఏ’తో గీతం అవగాహనా ఒప్పందం

Mar 1 2014 12:25 AM | Updated on Jul 28 2018 8:18 PM

ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో 8,500 కార్పొరేట్ సంస్థల అధికారిక చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థగా బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ)తో రాష్ట్రంలో తొలిసారిగా గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని విశ్వవిద్యాలయవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

 సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో 8,500 కార్పొరేట్ సంస్థల అధికారిక చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థగా బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఏసీసీఏ)తో రాష్ట్రంలో తొలిసారిగా గీతం విశ్వవిద్యాలయం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని విశ్వవిద్యాలయవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం ఒప్పందంపై సంతకాల కార్యక్రమం సందర్భంగా భారత్‌లో ఏసీసీఏ రిలేషన్‌షిప్ మేనేజర్ ఇల్హామ్ పంజానీ మాట్లాడుతూ... ఏసీసీఏ సిలబస్‌ను అధ్యయనం చేసే భారతీయ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతాయని, దేశంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి సంస్థలకూ ఏసీసీఏ సర్టిఫికెట్ కలిగిన నిపుణుల అవసరం ఉంటుందన్నారు.
 
  దేశంలో ప్రస్తుతం 7 వేల మంది విద్యార్థులు ఏసీసీఏ కోర్సులు అభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. ఏసీసీఏ సిలబస్‌ను బీకామ్ కోర్సుతో కలిపి విద్యార్థులకు బోధించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement