'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా' | Deputy Speaker Padma Devender Reddy attends as a chief guest in Women's day celebrations | Sakshi
Sakshi News home page

'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'

Mar 5 2016 7:13 PM | Updated on Aug 11 2018 8:09 PM

'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా' - Sakshi

'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'

మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు.

మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆ రోజున తమ ఇబ్బందులు, కష్టాలను చర్చించుకునే అవకాశం దక్కేలా కృషి చేస్తానని చెప్పారు.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'మహిళా ఉపాధ్యాయ సదస్సు'లో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగవాళ్లంతా చూసి గర్వం అనుకుంటున్నారని... కాలు మీద కాలు వేసుకునేది గర్వంతో కాదు, కాళ్లు నొప్పులతోనేనని సరదాగా చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement