డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు.. | degree student suffers ragging, abscands from college | Sakshi
Sakshi News home page

డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..

Aug 6 2015 6:47 PM | Updated on Sep 3 2017 6:55 AM

డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..

డ్రెస్ కోడ్ బాలేదన్నందుకు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ.. డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థిని కాలేజి నుంచి అదృశ్యమైంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కాలేజిలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు వేధిస్తున్నారంటూ.. డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలిపింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగారుపడ్డారు.

నిజాం కాలేజీలో బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న రాజేశ్వరి అనే విద్యార్థినినీ అదే కాలేజీకి చెందిన రాజశేఖర్ అనే సీనియర్ డ్రెస్ కోడ్ సరిగా లేదని బుధవారం సాయంత్రం చెప్పాడు. ఈ విషయం గురువారం కాలేజీ మొత్తం తెలియడంతో తోటి విద్యార్ధినులు రాజేశ్వరిని ఈ విషయం గురించి అడిగారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బర్కత్‌పురలోని తన హాస్టల్‌కు వెళ్లి కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది.

అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు హాస్టల్‌కు వెళ్లి అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆబిడ్స్ పోలీసులకు అప్పగించారు. సీనియర్ రాజశేఖర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఇద్దరినీ జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కేవలం డ్రెస్ కోడ్ సరిగా లేదని మాత్రమే సలహా ఇచ్చానని రాజశేఖర్చెప్పడం, అదే విషయాన్ని రాజేశ్వరి ధ్రువపర్చడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement