ఎయిర్‌పోర్టులో భారీగా సెల్‌ఫోన్లు స్వాధీనం | customs officers seize smuggled cell phones in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో భారీగా సెల్‌ఫోన్లు స్వాధీనం

Oct 27 2016 10:06 AM | Updated on Sep 4 2017 6:29 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సెల్‌ఫోన్లను పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ రోజు ఉదయం బ్యాంకాక్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీలో ఈ విలువైన సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. అయితే అవి ఎలాంటి కంపెనీ పేరులేని విలువైన ఫోన్లుగా సమాచారం. దీంతో సదరు మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement