ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులను రప్పించండి | CS Rajiv Sharma to Telangana Gazetted Officers Association | Sakshi
Sakshi News home page

ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులను రప్పించండి

May 20 2016 4:28 AM | Updated on Jun 2 2018 2:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి వచ్చే విధంగా చూడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు గురువారం వినతిపత్రం సమర్పిం చారు.

* సీఎస్ రాజీవ్‌శర్మకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి వచ్చే విధంగా చూడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు గురువారం వినతిపత్రం సమర్పిం చారు. అలాగే తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వెంటనే వారి రాష్ట్రానికే పంపించాలని, స్టేట్ కేడర్‌లోని పోలీసు అధికారులలో తెలంగాణ వారిని ఇక్కడే ఉంచి, ఆంధ్రా వారిని అక్కడికే పంపాలని కోరారు.

సీఎస్‌ను కలిసిన వారిలో ఆ సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సంఘం నేతలు సత్యనారాయణ, మధుసూదన్‌గౌడ్, కృష్ణ యాదవ్, జి.వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement