కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు స్వాధీనం | cordon search in hyderabad and vehicles seized | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు స్వాధీనం

May 22 2016 7:32 AM | Updated on Oct 4 2018 8:29 PM

మాదాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: మాదాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లో డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఆదివారం ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హాస్టళ్లలో తనిఖీల సందర్భంగా 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement