‘ఆర్డీఎస్’పై రేపు కాంగ్రెస్ దీక్ష | congress party strike tomarrow on rds | Sakshi
Sakshi News home page

‘ఆర్డీఎస్’పై రేపు కాంగ్రెస్ దీక్ష

May 8 2016 2:53 AM | Updated on Mar 18 2019 7:55 PM

‘ఆర్డీఎస్’పై రేపు కాంగ్రెస్ దీక్ష - Sakshi

‘ఆర్డీఎస్’పై రేపు కాంగ్రెస్ దీక్ష

మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరందిందే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు రాజోలిబండ మళ్లింపు రిపేరు పనుల్లో

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరందిందే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు రాజోలిబండ మళ్లింపు రిపేరు పనుల్లో జాప్యానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోమవారం మహాదీక్షకు దిగుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో దాదాపు 10వేల మందితో మహాదీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రాజోలిబండ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 15.9 టీఎంసీల నీటితో 87 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 30 వేల ఎకరాలకు మించి అందడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు.

ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న కేసీఆర్.. రాజోలిబండను పట్టించుకోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అయిజ మండలం సిందనూరు వద్ద జరిగే ఈ మహాదీక్షలో  కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, డి.కె.అరుణ, జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. 10న పీసీసీ బృందం కర్ణాటకకు బయలుదేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement