కళాశాల విద్య పరిధిలోకి ఇంటర్మీడియెట్ | College education under the Intermediate | Sakshi
Sakshi News home page

కళాశాల విద్య పరిధిలోకి ఇంటర్మీడియెట్

Feb 24 2016 3:11 AM | Updated on Mar 21 2019 9:07 PM

ఇంటర్మీడియెట్ విద్యను కళాశాల విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అధికారులకు సీఎం ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్  విద్యను కళాశాల విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ బడ్జెట్‌పై మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వ చ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం... ఇంటర్మీడియెట్ విద్యను పాత విధానంలో భాగంగా కళాశాల విద్య డెరైక్టరేట్ పరిధిలోనే కొనసాగించాలని ఆదేశించినట్లు సమాచారం. 14 రకాల విభాగాలు అక్కర్లేదని, పలు విభాగాలను కుదించాలని సూచించారు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1969లో విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఐఏఎస్ అధికారి రాజగోపాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఇంటర్మీడియెట్ (+2) విద్యావిధానం అమల్లోకి తెచ్చారు. 1989 వరకు కళాశాల విద్య, ఇంటర్మీడియెట్ విద్య రెండూ కళాశాల విద్యా డెరైక్టరేట్ పరిధిలోనే కొనసాగాయి. 1989లో ఇంటర్మీడియెట్ విద్యను ఆ డెరైక్టరేట్ నుంచి వేరు చేశారు. గతంలో పాఠశాల విద్యా పరిధిలోకి ఇంటర్మీడియెట్‌ను తీసుకువచ్చి సీబీఎస్‌ఈ తరహాలో (11, 12 తరగతుల విధానం) కొనసాగించాలన్న చర్చలు జరిగాయి. కానీ అనూహ్యంగా పాత విధానాన్ని అనుసరించాలని సీఎం ఆదే శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement