
గొత్తికోయల దాడి వెనుక సీఎం కుట్ర
తాడ్వాయి అడవుల్లో గొత్తికోయలపై అటవీ అధికారుల దాడి వెనుక సీఎం కేసీఆర్ కుట్ర ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
తాడ్వాయి మండలం జలగలంచ అటవీ ప్రాంతంలో అధికారుల దాడికి గురైన బాధిత గిరిజనులు బుధవారం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. వీరిని ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి పరామర్శించారు.