నేడు ఢిల్లీకి చంద్రబాబు | Chandrababu to delhi today | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి చంద్రబాబు

Mar 10 2016 2:39 AM | Updated on Aug 14 2018 11:26 AM

నేడు ఢిల్లీకి చంద్రబాబు - Sakshi

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమా భారతిలతో ఆయన సమావేశమవుతారు.

రాత్రికి లండన్ పయనం

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమా భారతిలతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. అనంతరం గురువారం రాత్రి ఆయన లండన్ పర్యటనకు బయలుదేరతారు. సీఎం వెంట ఆర్థిక, పురపాలక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ కూడా వెళతారు. స్థానికంగా జరిగే పెట్టుబడిదారుల సమావేశం, అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 13వ తేదీ తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

కాగా, బుధవారం అసెంబ్లీ ఆవరణలో చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నే తృత్వంలో వాల్మీకి సామాజికవర్గ ప్రతినిధులు సీఎంను కలిశారు. తమను ఎస్టీలో చేరుస్తామని గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడంపై కృత జ్ఞతలు తెలిపారు. రజక సంఘం ప్రతినిధులు కూడా సీఎంను కలిసి తమను ఎస్టీల్లో చేరుస్తామన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిలీనియం అలయెన్స్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో వినూత్న సాంకేతిక పద్ధతుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరిస్తామని వారు సీఎంకు హామీనిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement