కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆనం వివేకా | Chandrababu naidu visited anam vivekanamda reddy at kims hospital | Sakshi
Sakshi News home page

కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆనం వివేకా

Apr 13 2018 1:18 AM | Updated on Apr 13 2018 6:56 PM

Chandrababu naidu visited anam vivekanamda reddy at kims hospital - Sakshi

హైదరాబాద్‌: అనారోగ్యంతో బాధపడుతూ  సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. గురు వారం సాయంత్రం ఆయన ఏపీ మంత్రులు     సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలతో కలసి  ఆస్పత్రికి వచ్చారు. వివేకాను పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు.

ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్‌ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.  చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement