ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక సాయంపై ఆయన ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రే ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆయన నిన్న రాత్రి గవర్నర్ నరసింహాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో గవర్నర్‌తో వివిధ అంశాలపై చర్చించారు.