బాబోయ్‌ చైన్‌ స్నాచర్లు.. మహిళను పడేశారు | chain snachers once again disrupt people in hyderabad | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ చైన్‌ స్నాచర్లు.. మహిళను పడేశారు

Jul 28 2017 1:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

బాబోయ్‌ చైన్‌ స్నాచర్లు.. మహిళను పడేశారు - Sakshi

బాబోయ్‌ చైన్‌ స్నాచర్లు.. మహిళను పడేశారు

నగరంలో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగారు.

హైదరాబాద్‌: నగరంలో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగడంతో.. ఒక్కసారిగా బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో.. మహిళతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మాజిద్‌పూర గ్రామానికి చెందిన ఆండాలు అనే మహిళ తన కుమారుడితో కలిసి బైక్‌పై నగరానికి వస్తుండగా.. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాగారు. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో.. ఆండాలుతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement