మిర్చి రూ.10 వేలకు కొనేలా చూడాలి | Chada Venkatareddy demand's chillis support price | Sakshi
Sakshi News home page

మిర్చి రూ.10 వేలకు కొనేలా చూడాలి

May 7 2017 2:17 AM | Updated on Aug 15 2018 9:30 PM

మిర్చి రూ.10 వేలకు కొనేలా చూడాలి - Sakshi

మిర్చి రూ.10 వేలకు కొనేలా చూడాలి

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. మిర్చి క్వింటాల్‌ రూ.10 వేలకు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆ మేరకు సీఎం కేంద్రాన్ని ఒప్పించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. మిర్చి క్వింటాల్‌ రూ.10 వేలకు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బ్యాంకు నుంచి అప్పు తీసుకొనైనా రైతుల పంటలను కొనడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

మిర్చి క్వింటాల్‌కు కేంద్రం ప్రకటించిన రూ.5 వేలు ఏమాత్రం సరిపోదన్నారు. రైతే రాజు అంటున్న సీఎం, గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న మిర్చి రైతులను ఆదుకునే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నాయన్నారు. రైతులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement