వందకు పైగా వీధి కుక్కలను ఒకేసారి చంపించినందుకు మీర్పేట గ్రామ కార్యదర్శిపై పోలీస్ కేసు నమోదైంది.
హైదరాబాద్ : వందకు పైగా వీధి కుక్కలను ఒకేసారి చంపించినందుకు మీర్పేట గ్రామ కార్యదర్శిపై పోలీస్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ కథనం ప్రకారం ఇటీవల మీర్పేటలోని పలు కాలనీలలో సుమారు వందకు పైగా కుక్కలకు విష ప్రయోగం ద్వారా గ్రామ కార్యదర్శి భాస్కర్ రెడ్డి చంపించారు.
అయితే మూగ జీవులను చంపించే అధికారం గ్రామ కార్యదర్శికి లేదని, పై అధికారుల అనుమతి తీసుకోకుండా, జంతు ప్రేమికులను అవమానపరిచేలా వ్యవహిరించి మూగ జీవుల చావుకు కారకుడైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుడు వేముల నర్సింహతో పాటు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో భాస్కర్ రెడ్డిపై 428 ఐపీసీ, 11(1) ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.