ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా | Car turn over Express way | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా

Oct 25 2016 8:28 AM | Updated on Sep 4 2017 6:17 PM

రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది.

హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement