బంజారాహిల్స్లో డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు | car rash driving in hyderabad | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

Oct 17 2015 9:10 AM | Updated on Sep 4 2018 5:16 PM

బంజారాహిల్స్లో డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు - Sakshi

బంజారాహిల్స్లో డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

బంజారాహిల్స్ రోడ్ నెం.3లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజంపేటకు చెందిన కాపర్తి హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఈరోజు ఉదయం మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీ కాలనీ నుంచి వారాసిగూడకు ఆయన కారులో బయలు దేరాడు. అతి వేగంగా కారు నడపడంతో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాదం గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసస్టేషన్కు సమాచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement