వృత్తి డ్రైవర్...ప్రవృత్తి ప్రేమ పెళ్లిళ్లు | car driver arrested in hyderabad due to fake love married | Sakshi
Sakshi News home page

వృత్తి డ్రైవర్...ప్రవృత్తి ప్రేమ పెళ్లిళ్లు

Nov 23 2016 7:49 PM | Updated on Aug 28 2018 7:14 PM

వృత్తి డ్రైవర్...ప్రవృత్తి ప్రేమ పెళ్లిళ్లు - Sakshi

వృత్తి డ్రైవర్...ప్రవృత్తి ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పేరుతో మోసం చేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ వివాహాలు చేసుకుంటున్న ఓ యువకున్ని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.... నాగోలు సాయినగర్‌కు చెందిన మహేష్ (25) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలోనే మహేష్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015లో తన భార్యకు తెలియకుండా ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తరువాత మహేష్‌కు ముందే వివాహమైందని యువతికి తెలియడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి మహేష్‌ను రిమాండ్‌కు తరలించారు.

జైలుకు వెళ్లి వచ్చినా మహేష్ బుద్ధిని మార్చుకోలేదు. గత నెలలో ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన యువతిని ప్రేమ పేరుతో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత మహేష్ తనను మోసం చేసి మూడవ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న యువతి ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మహేష్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement