భోగి మంటల్లో కారు దగ్ధం | car burnt in bhogi fire in banjara hills | Sakshi
Sakshi News home page

భోగి మంటల్లో కారు దగ్ధం

Jan 14 2017 3:00 PM | Updated on Aug 14 2018 3:24 PM

భోగి మంటల్లో కారు దగ్ధం - Sakshi

భోగి మంటల్లో కారు దగ్ధం

భోగి పండుగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.

బంజారాహిల్స్(హైదరాబాద్): 
భోగి పండుగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భోగి మంటలు వ్యాపించి కారు దగ్ధమైన సంఘటన కమలాపురికాలనీ గణపతి కాంప్లెక్స్‌ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోట భార్గవరావుకు చెందిన కారు డ్రైవర్‌ సికిందర్‌ యజమాని కుమారుడిని ట్యూషన్‌కు తీసుకొచ్చి రోడ్డు పక్కన కారు ఆపాడు. అయితే అక్కడ భోగి మంటలు ఉన్న విషయాన్ని అతను గుర్తించకపోవడంతో చూసుకోకపోవడంతో ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. 
 
ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో కారులో కూర్చున్న సికిందర్‌ను స్థానికులు అప్రమత్తం చేయడంతో అతను కారులో నుంచి బయటకు దూకి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే కారు చాలా వరకు దగ్ధమైంది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement