తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: సి.రామచంద్రయ్య | C . Ramachandraiah demands CBI probe into Tuni violence | Sakshi
Sakshi News home page

తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: సి.రామచంద్రయ్య

Jun 10 2016 6:10 PM | Updated on Sep 4 2017 2:10 AM

తెలుగు దేశం ప్రభుత్వం కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఏపీ శాసన మండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు.

తెలుగు దేశం ప్రభుత్వం కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఏపీ శాసన మండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కాపురిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిన్నారని అన్నారు. తుని ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయనీ..దీనిపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 శుక్రవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకూ కడప రౌడీలు తుని ఘటన వెనుక ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు గోదావరి జిల్లా నాయకులను అరెస్టు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పై కాపులకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. ఇప్పటి కైనా టీడీపీ లోని కాపు నాయకుల చేత విమర్శలు చేయించే పని ఆపి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement