శభాష్‌ నీలిమ | Brilliant Neelima | Sakshi
Sakshi News home page

శభాష్‌ నీలిమ

Oct 13 2016 11:29 PM | Updated on Sep 4 2017 5:05 PM

సాక్షి, సిటీబ్యూరో: గుండెపోటుకు గురైన ఓ ప్రయాణికుడిని సత్వరమే ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ముషీరాబాద్‌–1 డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ నీలిమకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

సాక్షి,  సిటీబ్యూరో: గుండెపోటుకు గురైన  ఓ ప్రయాణికుడిని  సత్వరమే ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి  కాపాడిన ముషీరాబాద్‌–1 డిపోకు చెందిన  ఆర్టీసీ  కండక్టర్‌ నీలిమకు ప్రశంసలు  వెల్లువెత్తాయి. ఆమె సమయస్ఫూర్తి పట్ల తెలంగాణ ఆర్టీసీ  చైర్మెన్‌  సోమారపు  సత్యనారాయణ  సంతోషం  వ్యక్తం చేశారు. గురువారం  బస్‌భవన్‌లో  రూ.2 వేల నగదు  పురస్కారాన్ని అందజేసి  అభినందించారు. సికింద్రాబాద్‌–జియాగూడ (1జే) రూట్‌ బస్సుల్లో  నీలిమ విధులు నిర్వహిస్తుండగా  ఒక ప్రయాణికుడు  హార్ట్‌ ఎటాక్‌తో  బాధపడడం గమనించింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి  తరలించి సకాలంలో  వైద్యం అందేవిధంగా  చొరవ చూపింది. దీంతో  సదరు ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న చైర్మెన్‌ ఆమెను బస్‌భవన్‌లో అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌లు నాగరాజు, పురుషోత్తమ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement