'టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ నేతలు' | bjp mlc ramachandra rao speaks over tdp allegation in municipal elections | Sakshi
Sakshi News home page

'టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ నేతలు'

Feb 18 2016 2:29 PM | Updated on Mar 29 2019 8:30 PM

తెలంగాణ బీజేపీ కోర్కమిటీ సమావేశం గురువారం హైదరాబాద్లో జరిగింది.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్కమిటీ సమావేశం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, అచ్చంపేట ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. టీడీపీతో పొత్తు అంశం స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రామచంద్రరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement