'ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు' | bjp leaders blames the opposition | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు'

Aug 22 2015 12:36 PM | Updated on Mar 28 2019 8:37 PM

రాష్ట్ర విభజన సమయంలో నిద్రపోయిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు రఘునాథబాబు, సుధీశ్ రాంభట్ల వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నిద్రపోయిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు రఘునాథబాబు, సుధీశ్ రాంభట్ల వ్యాఖ్యానించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తోంది వెంకయ్యనాయుడు మాత్రమేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలంటూ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రూ.63వేల కోట్లను ఏపీ అభివృద్ధికి కేటాయించిందని రఘునాథబాబు, సుధీశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement