భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి | BJP fires on Land scam | Sakshi
Sakshi News home page

భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి

Jun 15 2017 4:10 AM | Updated on Mar 28 2019 8:37 PM

భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి - Sakshi

భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి

రాష్ట్రంలో చోటు చేసుకున్న భూకుంభకోణాలపై అనేక ఆధారాలు బయటపడుతున్నందున ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ

బీజేపీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటు చేసుకున్న భూకుంభకోణాలపై అనేక ఆధారాలు బయటపడుతున్నందున ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ సీనియర్‌ నేతలు డాక్టర్‌ నాగం జనార్దనరెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక్క గజం కబ్జా కాలేదని, ఒక్క పైసా నష్టం జరగలేదని సీఎం కేసీఆర్‌ తనకు తానుగా ఏవిధంగా సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారని ప్రశ్నించారు. భూకుం భకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించకుంటే సీఎం కేసీఆర్‌బాధ్యతల నుంచి తప్పు కోవాలని డిమాండ్‌ చేశారు.

సీఎం చెబుతున్నట్లు ఒక్క గజం కూడా కబ్జా కాకుంటే, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకపోతే మియాపూర్‌ భూములతోపాటు, దండు మైలారంలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు కుటుంబసభ్యుల భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులు నివేదిక ఎందుకు ఇచ్చారని ప్రశ్నిం చారు. ఈ కుంభకోణాలు జరగకపోతే 72 మంది సబ్‌ రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 750 ఎకరాల ఎవక్యూ ప్రాపర్టీ పరి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. భూ ఆక్రమణలన్నీ సీఎం కార్యాలయం ప్రత్యక్ష ప్రమేయంతోనే జరుగు తున్నాయని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూముల వివరాలను వెబ్‌సైట్‌ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు గోప్యంగా ఉంచుతు న్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement