హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ మండలంలోని కోళ్ల ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో బర్డ్‌ఫ్లూ అనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ మండలంలోని కోళ్ల ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో బర్డ్‌ఫ్లూ అనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ధైర్యంగా ఉన్న కోళ్ల ఫారాల రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో ఉన్న ఓ ఫారంలో పది రోజులుగా కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. నెల క్రితం తొర్రూరు గ్రామంలో బర్డ్‌ఫ్లూ సోకిన సమయంలో వైద్యులు వచ్చి పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
గత మూడు రోజుల నుంచి మొత్తం 80 వేల కోళ్లలో 10 వేల వరకు మృత్యువాత పడ్డాయి. మండల పశు వైద్యాధికారి ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. సదరు రైతు ఫిర్యాదుతో ఫారంలోని కోళ్ల శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపామని చెప్పారు. పరీక్షల రిపోర్ట్ వచ్చాకే బర్డ్‌ఫ్లూ సోకిందీ లేనిదీ నిర్ధారించగలమని తెలిపారు.
(తుర్కయంజాల్)